Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వచ్చే నెల విడుదల కానున్న 'జన నాయగన్'

వచ్చే నెల విడుదల కానున్న 'జన నాయగన్'

maa gulf 1 week ago

మిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలకు సిద్ధమవుతోంది.

ఎన్నికలకు ముందే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను వచ్చే నెలలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

'ముఖ్యమంత్రి' టైటిల్ ప్రతిపాదనను తిరస్కరించిన విజయ్

విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నందున, 'జన నాయగన్' సినిమాలో ఆయన పేరుకు ముందు ఎప్పటి నుంచో వస్తున్న 'దళపతి' అనే బిరుదుకు బదులుగా 'ముఖ్యమంత్రి విజయ్' అని స్క్రీన్‌పై వేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, ఈ ప్రతిపాదనను సీఎం విజయ్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. సినిమా రంగంలో తనను అంతటి వాడిని చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు గౌరవమిస్తూ.. ఎప్పటిలాగే 'దళపతి' అనే ట్యాగ్ లైన్‌నే కొనసాగించాలని ఆయన నిర్మాతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.

రాజకీయ హోదాను దృష్టిలో ఉంచుకుని సినిమాలో ఆయన ఇంట్రడక్షన్ సీన్లను లేదా కొన్ని పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగులను మార్చాలని చిత్రబృందం మొదట అనుకుంది. అయితే, అలంటి మార్పులు ఏవీ వద్దని విజయ్ వారిని తెలిపినట్టు సమాచారం. పొలిటికల్ ఇమేజ్ కోసం కాకుండా, సినిమాను సినిమాగా మాత్రమే చూడాలనే ఆయన నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వార్త ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు సోషల్ మీడియా సర్కిల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu