Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!

విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!

maa gulf 1 week ago

నామా: 2022 -2024 మధ్య బహ్రెయిన్ ప్రైవేట్ రంగంలో విదేశీ ఉద్యోగుల సంఖ్య దాదాపు 0.6 శాతం పెరిగింది. అదే సమయంలో బహ్రెయిన్ వాసుల ఉద్యోగ నియామకాలు 4 శాతానికి పైగా పెరిగింది.

ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది.

ప్రైవేట్ రంగంలో బహ్రెయిన్ కార్మికులు 2022లో 99,945 నుండి 2024లో 103,986కి పెరిగారు. ఇదే కాలంలో విదేశీ కార్మికులు 464,304 నుండి 467,267కి పెరిగారు.

ఎంపీ డాక్టర్ మునీర్ సెరూర్ కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ప్రతి రంగం బహ్రెయిన్కరణ రేట్లకు లోబడి ఉంటుందని, అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు బహ్రెయిన్ ల నుంచి డిమాండ్‌ను బట్టి మారుతుందని పేర్కొంది.

ఈ రేట్లను ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాణాలను అందుకోని సంస్థల నుండి, ప్రతి ప్రవాస కార్మికుడి నియామక అనుమతికి 500 బహ్రెయిన్ దినార్ల (BD) రుసుము వసూలు చేయబడుతుందని తెలిపింది. ప్రభుత్వ టెండర్ల కోసం బిడ్ వేయడానికి కూడా బహ్రెయిన్‌కరణ రేట్లను అందుకోవడం ఒక షరతు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.

బహ్రెయిన్ కార్మికులు ప్రైవేట్ రంగంలో పోటీపడగలరని నిరూపించుకున్నారని, ప్రస్తుతం అనేక సంస్థలు బహ్రెయిన్ సిబ్బందిపై ఆధారపడుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొన్ని సంస్థలలో బహ్రెయిన్‌కరణ 80 నుండి 90 శాతం మధ్యకు చేరుకుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu