Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థినులకు ప్రతినెలా మూడు సెలవులు

విద్యార్థినులకు ప్రతినెలా మూడు సెలవులు

maa gulf 1 week ago

కొచ్చిన్‌: విద్యార్థినులకు ప్రతినెలా మూడు రోజులపాటు రుతుక్రమ సెలవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అసంఘటిత రంగాల్లో పనిచేసే మహిళలకు జీతంతో కూడిన 6 నెలల ప్రసూతి (మెటర్నిటీ) సెలవులు అమలు చేయనుంది.

కేరళ నూతన శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ శుక్రవారం ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. కొత్త ప్రభుత్వం రాష్ట్ర అసలు ఆర్థిక పరిస్థితిపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తుందని చెప్పారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ పేరుతో ఆరోగ్య బీమా పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Maa Gulf Telugu