హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అర్చకులు కలిసి వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ నెల 23న యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల నిర్మాణంతో పాటు దేవస్థానానికి సంబంధించిన ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై శంకుస్థాపన చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, వేద విద్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన ప్రతినిధి బృందంలో ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని శంకర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

