ఉత్తర్ ప్రదేశ్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం నుంచి 74మంది మృతి చెందారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.భదోహి, బుడౌన్ జిల్లాల్లో భారీ వానలతో పాటు ఈదురు గాలులు అలజడి సృష్టించాయి.
అనేక మంది గాయపడ్డారు.విద్యుత్తు సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
సహాయక చర్యలు...
మొబైల్ నెట్ వర్క్ లుకూడా పనిచేయలేదు. కొందరు తీవ్రగాయాలపాలయ్యారు.గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. విద్యుత్తు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అలాగే పడిపోయిన చెట్లను కూడా తొలగిస్తున్నట్లు చెప్పారు.

