Posts
ఆస్కార్ అవార్డులకు పోటీపడుతున్న సూర్య చిత్రం.
ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా ఎంతటి పెద్ద విజయం అందుకుందో తెలిసిందే. కరోనా కాలంలో ఓటీటీలో విడులైన అన్ని చిత్రాల్లో కంటే సూర్య ఆకాశం నీ హద్దురా. పెద్ద హిట్ గా నిలిచింది. అభిమానుల మనస్సులు గెలిచిన ఈ చిత్రం ఇపుడు మరో ఘనత సాధించింది. ఆస్కార్ బరిలో ఈ చిత్రం నిలిచింది.
తెలుగు వెర్షన కాకుండా తమిళంలో వచ్చిన `సూరరై పొట్రూ` ఆస్కార్ బరిలో నిలిచింది. జనరల్ కేటగిరీ కింద పలు అవార్డులకు ఈ చిత్రం పోటీపడుతోంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోరు విభాగంలో పోటీపడుతోంది. `సూరరై పొట్రూ` ప్రస్తుతం అకాడమీ స్క్రీనింగ్ దశలో అందుబాటులో ఉంది. ఈ విషయాన్ని సహ నిర్మాత రాజ్‌శేఖర్ పాండియన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూర్య నటిస్తూ గూనీత్ మోంగాతో కలిసి నిర్మించారు. ఏయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు డా. జి.ఆర్ గోపీనాథ్ జీవితకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని సూర్య భారీ వ్యవప్రయాసలకోర్చి నిర్మించారు. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్, కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే.
related stories
-
చిత్రజ్యోతి గుడ్ బై టు సినిమా ఘర్
-
హోమ్ ఆస్కార్ బరిలో 'ఆకాశం నీ హద్దురా'
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు వెల్చేరుకు కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్