Posts
భళా 'భారత్' : కొత్త రకం కరోనా కు దేశీవాళీ టీకాతో కళ్లెం

కరోనా కారణంగా ప్రపంచం స్థంభించింది. లాక్ డౌన్ లతో అన్నిదేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా టీకా ఉత్పత్తి కోసం అన్ని దేశాల శాస్త్ర వేత్తలు రంగంలోకి దిగారు. అమెరికా, రష్ట్యా, చైనా, భారత్ .. వ్యాక్సిన్ తయారీలో కీలకంగా మారాయియ. ముఖ్యంగా ఇండియా ఉత్పత్తి చేసే వ్సాక్సిన్ కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఎంది. ఎందుకంటే టీకాలో తయారీలో మనదేశానికి మంచి రికార్డు ఉంది. అందుకే ఇండియా వ్యాక్సిన్ కు ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో సిరమ్ సంస్థ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ రూపొందించింది. హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పేరుతో మరో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది.
ప్రస్తుతం ప్రపంచంలో కొత్త రకం కరోనా.స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లు స్ట్రెయిన్ పై ఎంత వరకూ పనిచేస్తాయో అనేదానిపై అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో భారత్ బయోటెక్ శుభవార్త చెప్పింది. కరోనాతో పాటు కొత్త రకం కరోనా.స్ట్రెయిన్ పైనా తమ వ్యాక్సిప్ పనిచేస్తుందని ప్రకటించింది. బ్రిటన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది తప్ప.. దీని వల్ల అంతగా ప్రాణాపాయం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తమ వ్యాక్సిన్ అయిన కోవాగ్జిన్ కొత్త రకం కరోనా వైరస్‌ను విజయవంతంగా నిలువరిస్తోందని భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్ చేసింది.
దేశంలో గత పది రోజుల నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. దేశీయంగా సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ తో పాటు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ డోసులను ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేస్తున్నారు. ఓ వైపు ఈ వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుండగానే.. తమ కంపెనీకి చెందిన కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిన కొత్త రకం కరోనా వైరస్ అయిన యూకే కరోనా వెరియంట్‌పై తమ టీకా సమర్థవంతంగా పని చేస్తున్నట్టు భారత్ బయోటెక్ ప్రకటనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.