Friday, 22 Jan, 9.34 pm Madathakaja

Posts
ల్యాప్‌టాప్‌ల పంపిణీపై సీఎం జగన్‌ సమావేశం

గ్రామాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు, అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామాలకు అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ అందించాలని, అంతరాయాలు లేకుండా నెట్‌వర్క్‌ అందించాలని అధికారులకు సూచించారు. ఏ స్థాయి కనెక్షన్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. గ్రామాల్లో నెట్‌వర్క్‌ పాయింట్‌ వద్ద ఇంటర్నెట్‌ లైబ్రరీ.. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్‌ ఫ్రం హోం సదుపాయాలు ఏర్పాటు చేయాలని.. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

విద్యార్థులకిచ్చే ల్యాప్‌టాప్‌లపైనా ఆలోచన చేయాలని సీఎం సూచించారు. వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. ల్యాప్‌టాప్‌ చెడిపోయిందని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే వారం రోజుల్లో మరమ్మతులు చేసి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖమంత్రి గౌతమ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Madathakaja
Top