Wednesday, 27 Jan, 4.31 pm Madathakaja

Posts
వావి వరుసలు మరచిన కామాంధుడు..ఏమి చేసాడంటే

వావి వరుసలు మరచి వరుసకు చెల్లెలు పై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గ్రామంలో ఎస్సి కాలనీకి చెందిన శ్రీరాములు, రామలక్ష్మి దంపతుల మూడవ కుమార్తె (19) ఇంటి వద్దే ఉంటుంది. అయితే ఆ యువతిపై వరుసకు అన్న అయ్యే లక్ష్మన్న కన్నేశాడు.

ఆమెను లొంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు. అయితే యువతి ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడం..కేవలం యువతి ఒంటరిగా దొరకడంతో ఇంట్లోకి వెళ్లాడు. యువతిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అయితే యువతి అరుస్తుండటంతో యువతి నోటిలో గుడ్డలు కుక్కి బలవంతం చేయబోయాడు. కూలి పనులకు వెళ్లి వస్తున్న తల్లికి కూతురు కేకలు వినిపించడంతో తలుపు తీయగా లక్ష్మన్న పారిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన యువతిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Madathakaja
Top