Dailyhunt

Actress Trisha: రాజకీయాల్లోకి త్రిష? 'దళపతి' పార్టీలో చేరబోతుందా.. వైరల్ అవుతున్న పాత వీడియో!

MAHAA News 1 week ago

Actress Trisha: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త అలజడి మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని TVK (తమిళగ వెట్రి కళగం) పార్టీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఆ పార్టీపైనే ఉంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, TVK పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఈ రాజకీయ వేడిలో అనూహ్యంగా హీరోయిన్ త్రిష పేరు తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ముఖ్యమంత్రి అవుతానన్న త్రిష!
దీనికి ప్రధాన కారణం గతంలో త్రిష ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ. “వచ్చే పదేళ్లలో నేను తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతాను” అని ఆమె ఆ ఇంటర్వ్యూలో సరదాగా అన్నారో లేక సీరియస్‌గా అన్నారో కానీ, ఇప్పుడు ఆ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ పార్టీ విజయం అంచున ఉండటంతో, త్రిష పాత మాటలను నెటిజన్లు ప్రస్తుత పరిస్థితులకు ముడిపెడుతున్నారు. ఆమె త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

విజయ్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారా?
తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. త్రిష త్వరలోనే విజయ్ పార్టీలో చేరబోతున్నారట. ఒకవేళ విజయ్ రెండు స్థానాల్లో గెలిస్తే, ఆయన ఖాళీ చేసే ఒక స్థానం నుంచి త్రిష పోటీ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా ఆమె విజయ్ నివాసానికి వెళ్లడం కూడా ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. TVK పార్టీకి ఆమె ఒక ప్రత్యేక ఆకర్షణగా మారుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిజమెంత?
ఈ వార్తలన్నీ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నప్పటికీ, త్రిష నుంచి కానీ, TVK పార్టీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజకీయ రంగప్రవేశం గురించి ఆమె ఇప్పటివరకు మౌనంగానే ఉన్నారు. కాబట్టి వీటిని ప్రస్తుతానికి కేవలం ఊహాగానాలుగానే చూడాలి. మరోవైపు, విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలంటే కావాల్సిన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కోసం సర్వం సిద్ధమవుతోంది. మరి ఈ రాజకీయ ప్రయాణంలో త్రిష పాత్ర ఉంటుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News