Dailyhunt

Amaravati: రాజ్యసభ ముందుకు అమరావతికి చట్టబద్ధత బిల్లు

MAHAA News 3 weeks ago

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక ప్రక్రియలో భాగంగా నేడు రాజ్యసభలో చారిత్రాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు, దీనిపై ప్రస్తుతం సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.

ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభలోనూ గ్రీన్ సిగ్నల్ లభిస్తే, అమరావతి రాజధానిగా చట్టపరమైన పటిష్టతను సంతరించుకోనుంది. గత ఐదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, పార్లమెంట్ సాక్షిగా అమరావతికి గుర్తింపునివ్వడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News