Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Anna Konidala: మీరు ఎందరికో ఆదర్శం.. క్యూట్ ఫోటోతో విషెస్ చెప్పిన అన్నా కొణిదెల

MAHAA News 4 days ago

Anna Konidala: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రలో ఘనంగా జరుగుతున్నాయి. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతుండగా..

పవన్ సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తో ఉన్న ఒక్క క్యూట్ ఫోటో ని అభిమానులతో పంచుకుంటూ ఆమె రాసిన కాప్షన్ అందరికి ఆకట్టుకుంటుంది.

మీరు ఎందరికో ఆదర్శం.. అన్నా కొణిదెల భావోద్వేగం..

కిటికీ పక్కన పవన్ కళ్యాణ్‌తో కలిసి కూర్చుని, ఆయన వైపు ఎంతో ప్రేమగా చూస్తున్న ఫొటోను అన్నా కొణిదెల పంచుకున్నారు. దాని కింద "ఈరోజు మీ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, వారి ప్రార్థనల్లో నిలిచి ఉన్నారు. మీరు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపారో, సమాజానికి ఎంత మేలు చేశారో చెప్పడానికి వారి గుండెల్లో మీకున్న స్థానమే ప్రత్యక్ష నిదర్శనం. హ్యాపీ బర్త్‌డే!" అంటూ లవ్ ఎమోజీతో తన ప్రేమానురాగాలను చాటుకున్నారు.

గత కొద్ది నెలలుగా తీవ్రమైన భుజం నొప్పికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌కు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం కావడంతో, ఆమె పెట్టిన పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News