Dailyhunt

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏ1 రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు

MAHAA News 6 days ago

AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ1) ఉన్న రాజ్‌ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎట్టకేలకు ఉపశమనం కలిగించింది.

గత ఏడాది కాలంగా జైలులోనే ఉన్న ఆయనకు కొన్ని కఠినమైన షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. దీనివల్ల దాదాపు ఏడాది తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చే మార్గం సుగమమైంది.

అసలు విషయం ఏమిటంటే, రాష్ట్రంలోని మద్యం విధానంలో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సిట్ (SIT) అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో రాజ్‌ కేసిరెడ్డి పాత్ర కీలకమని గుర్తించిన అధికారులు, గతేడాది ఏప్రిల్ 25వ తేదీన ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఆయన రిమాండ్‌లోనే ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పలుమార్లు కోర్టును కోరగా, సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ బెయిల్ ఊరికే రాలేదు. కోర్టు కొన్ని ముఖ్యమైన షరతులను విధించింది. దర్యాప్తుకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో చర్చకు దారితీసిన ఈ కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం కేసు తదుపరి విచారణపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News