Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Ayodhya Ram Temple: అయోధ్య విరాళాలపై ట్రస్ట్ క్లారిటీ!.. బంగారం, వెండి అంతా భద్రం.. మీడియా ముందు విలువైన కానుకల ప్రదర్శన!

MAHAA News 4 days ago

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం జరిగిందంటూ వస్తున్న వార్తలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పందించింది. భక్తులు స్వామివారికి ఇచ్చిన కానుకలు, డబ్బులు అన్నీ పూర్తిగా భద్రంగా ఉన్నాయని ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను భక్తుల కోసం విడుదల చేసింది. ట్రస్ట్ తెలిపిన లెక్కల ప్రకారం.. మార్చి 31, 2026 నాటికి రామాలయం వద్ద ఉన్న నిధులు ఇవే..

  • బంగారం: 23.259 కేజీలు

  • వెండి వస్తువులు: 1,518.925 కేజీలు

మీడియా ముందు కానుకల ప్రదర్శన..

గత కొన్ని రోజులుగా బంగారు రామచరితమానస్ పుస్తకం, వజ్రాల నెక్లెస్, వెండి పాదుకలు (పాదరక్షలు) మాయమయ్యాయని సోషల్ మీడియాలో, రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇవన్నీ అబద్ధపు వార్తలని ట్రస్ట్ కొట్టిపారేసింది. ఆ వస్తువులన్నింటినీ స్వయంగా మీడియా ప్రతినిధుల ముందుకు తెచ్చి ప్రదర్శించింది. దేవుడికి అందిన ప్రతి కానుక చాలా భద్రంగా ఉందని, భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది.

కొత్తగా తాత్కాలిక జనరల్ సెక్రటరీ నియామకం..

ఆలయ పనుల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ట్రస్ట్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ (IFS) అధికారి కృష్ణ మోహన్‌ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. భక్తుల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, విరాళాల సేకరణలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసేందుకు ఒక ‘చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్’ (CEO)ను కూడా నియమించాలని అనుకుంటున్నారు. దీనికోసం ముగ్గురు సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఆలయ పాలన అంతా ఎంతో నమ్మకంగా, పద్ధతిగా సాగుతుందని కొత్త నాయకత్వం భరోసా ఇచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News