Bandla Ganesh: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ సంచలనం సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో విజయ్ పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతుండటంతో, ఆయన ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఉత్సాహంలో విజయ్ అభిమానులు పండగ చేసుకుంటుండగా, సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష పేరు ఒక్కసారిగా మారుమోగిపోతోంది. ఆమె కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
విజయ్ విజయవాడలో ఉన్నారో లేదో కానీ, నెట్టింట మాత్రం త్రిష ఫోటోలు, వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈరోజు త్రిష పుట్టినరోజు కావడం విశేషం. ఉదయాన్నే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ఆ తర్వాత నేరుగా విజయ్ ఇంటికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విజయ్ పార్టీకి మద్దతుగా ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, అందుకే ఆయనను కలిశారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెకు బర్త్‌డే విషెస్‌తో పాటు పొలిటికల్ అభినందనలు కూడా తెలియజేస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. త్రిషను ట్యాగ్ చేస్తూ.. “ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది.. కంగ్రాట్స్ త్రిష” అంటూ ఆయన రాసుకొచ్చారు. బండ్లన్న చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. త్రిష రాజకీయ కల నిజం కాబోతోందని ఆయన పరోక్షంగా క్లూ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు.
ఒకవైపు తమిళనాడులో విజయ్ సరికొత్త రాజకీయ చరిత్ర సృష్టిస్తుంటే, మరోవైపు త్రిష ఆయన వెంటే ఉండటం చూస్తుంటే.. త్వరలోనే ఆమె టీవీకే పార్టీలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. బండ్ల గణేష్ ట్వీట్ కూడా దీనిని బలపరిచేలా ఉండటంతో, దళపతి విజయ్ టీమ్‌లో త్రిష రోల్ ఏంటనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

