Dailyhunt

Bridal Weight Loss: అందంగా కనిపించాలని ఆకలిని చంపేస్తున్నారా? పెళ్లికూతుళ్లకు ముప్పుగా మారుతున్న వెయిట్ లాస్ ఇంజెక్షన్లు!

MAHAA News 1 week ago

Bridal Weight Loss: ఇంతకుముందు పెళ్లి ఫిక్స్ అయింది అంటే.. కొద్దిగా బొద్దుగా ఉన్న పెళ్లికూతురు జిమ్‌కి వెళ్లడం, మంచి డైట్ పాటించడం వంటి పద్ధతులు పాటించి పెళ్లి సమయానికి బరువు తగ్గి నాజూకుగా కనిపిండం మనం చూసే ఉంటాం.

కానీ మారుతున్న కాలంతో పాటు ఈ పద్ధతి కూడా మారిపోతుంది. ప్రస్తుతం 'మౌంజారో బ్రైడ్స్' (Mounjaro Brides) అనే ప్రమాదకరమైన కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. పెళ్లికూతులు ఇప్పుడు GLP-1 ఇంజెక్షన్ల వైపు మళ్లుతున్నారు. ఢిల్లీ, ముంబైలోని కొన్ని క్లినిక్‌లు ఈ ట్రెండ్‌కు ప్రధాన కేంద్రాలుగా మారాయి.

నడుము కొలతలను బట్టి ట్రీట్మెంట్ రేట్లు.. బ్రైడల్ వెయిట్ లాస్.. దీనిని 'మౌంజారో బ్రైడ్స్' అని అంటారు. ఈ ట్రీట్మెంట్‌ని కొన్ని హాస్పిటల్స్ రహస్యంగా చేస్తుంటే, మరికొన్ని అందరికీ తెలిసేలా చేస్తున్నాయి. ఈ ట్రీట్మెంట్‌కు అయ్యే డబ్బులను నడుము కొలతలను బట్టి నిర్ణయిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వారానికి ఒక మౌంజారో ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని ధర సుమారు 1,500 నుండి 2,000 డాలర్ల (లేదా వేల) వరకు ఉంటుంది. ఇలా మొత్తం కోర్స్ అయిపోయేసరికి ఖర్చు భారీగా దాటుతుంది.

అసలు ఆ మందులు ఏం చేస్తాయి? టైప్-2 డయాబెటిస్, ఇంకా తీవ్రమైన ఊబకాయం ఉన్న రోగుల కోసం తయారుచేసిన 'పెప్టైడ్' ఆధారిత మందులను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజెక్షన్ పెళ్లికూతురికి ఇవ్వడం వల్ల ముందుగా ఆకలిని చంపేస్తుంది, కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. దీనివల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు. దీంతో వధువు పెళ్లి సమయానికి బరువు తగ్గుతుంది. ఇంజెక్షన్ తీసుకున్న వారికి వాంతులు, విరోచనాలు, కడుపు ఉబ్బడం, శరీరం నీరసంగా అవ్వడం, జీర్ణకోశ సమస్యలు వెంటనే వస్తాయి.

డాక్టర్లు మాత్రం ఇది ఎంతమాత్రానికీ క్షేమం కాదని 'మౌంజారో బ్రైడ్స్' పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజు మంచిగా కనిపించడానికి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. సహజంగా బరువు తగ్గడానికి ప్రయత్నించకుండా ఇలా కృత్రిమంగా తగ్గడం మంచిది కాదు. పెళ్లి అనే టాపిక్ వచ్చే వరకు బరువు సమస్య కానప్పుడు, పెళ్లికి ముహూర్తం నిర్ణయించిన తరువాత ఎందుకు సమస్యగా మారుతుంది? ఫోటోలు, వీడియోలలో మంచిగా కనిపించడానికి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఈ ఇంజెక్షన్ తక్కువ మోతాదు ఇచ్చినా ప్రాణాంతక పరిస్థితి ఏర్పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News