Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!

MAHAA News 1 week ago

Buchi Babu Sana: ఇంకొన్ని రోజుల్లో పెద్ది సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో మూవీ టీమ్ ప్రొమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.

పెద్ది సినిమా కథ మొత్తం రింగ్ రోడ్డుపైనే తిరుగుతూ రాశానని చెప్పి షాక్ చేశారు బుచ్చిబాబు. రింగ్ రోడ్డుపైనే తిరుగుతూ ఈ సినిమా గురించి ఆలోచించేవాడినని చెప్పారు. అలాగే అసలు ఈ పెద్ది క్యారెక్టర్‌కి ఇన్స్పిరేషన్ ఎవరో కూడా పంచుకున్నారు. తన ఊర్లో పెద్దిరాజు అనే వ్యక్తి ఉండేవాడని, ఆయన కూలీకి వెళ్లేవాడని.. ఆయన క్రికెట్ బాగా ఆడేవాడని చెప్పారు. ఎప్పుడైనా బెట్ మ్యాచ్‌లు ఉన్నప్పుడు ఆ రోజు కూలీ డబ్బులు ఇచ్చి, తమతో కలిసి క్రికెట్ ఆడటానికి తీసుకుని వెళ్లేవాళ్లమని.. అలాగే ఇంకొంతమంది తనని బాస్కెట్‌బాల్ ఆడటానికి తీసుకుని వెళ్లేవారని తెలిపారు. ఆయనను చూసినప్పుడే పెద్దిరాజు క్యారెక్టర్‌ని బేస్ చేసుకుని ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చి పెద్ది క్యారెక్టర్ పుట్టింది. తర్వాత దీనికి వలస కూలీల బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి రాసుకున్న కథే ఈ సినిమా అని ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సన చెప్పారు.

ఇందులో హీరో క్యారెక్టర్‌తో పాటుగా జగపతిబాబు క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుందని ఆయన చెప్పారు. పెద్ది సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా టీమ్‌లో ఎవరిని అడిగినా ఒక్కటే మాట చెబుతున్నారు.. సినిమా లాస్ట్ 40 నిమిషాలు చూసిన తర్వాత కళ్లలో నీళ్లు రావడం పక్కా అంటున్నారు. బరువెక్కిన హృదయంతో థియేటర్ నుండి బయటికి వస్తారు అని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News