Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Credit Card Rules: క్రెడిట్ కార్డ్ వాడేవారికి షాక్.. మారిన 5 కీలక రూల్స్ ఇవే.. !

MAHAA News 1 month ago

Credit Card Rules: మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే. మీ క్రెడిట్ కార్డ్ నెలవారీ ఖర్చులు ఇకపై భారీగా పెరగనున్నాయి.

బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ సేవల నిబంధనలను (Credit Card Rules) కఠినతరం చేస్తూ.. జూన్ 15 నుంచే కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. పెనాల్టీలు, ఇంధన కొనుగోళ్లు, ప్రయాణ ఖర్చులు ఇంకా అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన 5 ముఖ్యమైన నిబంధనలను బ్యాంక్ మార్చేసింది.

1. మినిమం డ్యూ (Minimum Due) పెను భారం:

చాలామంది క్రెడిట్ కార్డ్ యూజర్లు పూర్తి బిల్లు కట్టకుండా కేవలం ‘మినిమం డ్యూ’ మాత్రమే చెల్లించి వదిలేస్తుంటారు. ఇకపై అలా చేస్తే భారీగా నష్టపోతారు. కొత్త రూల్స్ ప్రకారం.. మీరు ఫుల్ బిల్లు కట్టకపోతే మిగిలిన బ్యాలెన్స్ మొత్తంపై భారీ వడ్డీ పడుతుంది. అంతేకాదు, వరుసగా రెండు స్టేట్‌మెంట్ సైకిల్స్ (2 నెలలు) పాటు పూర్తి బిల్లును సకాలంలో చెల్లించేంతవరకు మీకు వడ్డీ మినహాయింపు (Interest-free period) లభించదు.

2. లేట్ పేమెంట్ ఫీజులు భారీగా పెంపు:

క్రెడిట్ కార్డ్ బిల్లు గడువు తేదీ దాటితే వేసే ఆలస్య రుసుములను బ్యాంక్ పెంచేసింది. రూ. 501 నుండి రూ. 1,000 బ్యాలెన్స్ ఉంటే.. ఇకపై రూ. 350కి బదులుగా రూ. 500 పెనాల్టీ పడుతుంది. రూ. 5,000 నుండి రూ. 10,000 బ్యాలెన్స్ ఉంటే.. గతంలో ఉన్న రూ. 550 ఛార్జీని ఇప్పుడు ఏకంగా రూ. 750 కి పెంచారు.

(గమనిక: ఈ పెరిగిన ఆలస్య రుసుములు క్లబ్ విస్తారా, ఎక్స్‌ప్లోరర్, పయనీర్ ప్రైవేట్, పయనీర్ హెరిటేజ్ వంటి కొన్ని ప్రీమియం కార్డులకు వర్తించవు).

3. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై అదనపు ఛార్జీల లిమిట్ కట్:

ఇకపై క్రెడిట్ కార్డుతో పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసేవారికి పరిమితి తగ్గింది. గతంలో నెలలో రూ. 50 వేల కంటే ఎక్కువ ఇంధనం కొంటేనే అదనపు ఛార్జీ పడేది. కానీ ఇప్పుడు ఆ లిమిట్‌ను రూ. 30 వేలకు తగ్గించారు. అంటే, నెలలో మీ కార్డుపై రూ. 30 వేల కంటే ఎక్కువ విలువైన పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తే.. ఆ పైబడిన మొత్తంపై 1 శాతం అదనపు రుసుముతో పాటు జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉంటుంది.

4. ప్రయాణాలు మరియు క్యాబ్ బుకింగ్స్ మరింత కాస్ట్‌లీ:

ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సర్వీసులు, బస్సు, రైలు టికెట్ల బుకింగ్స్ లేదా హైవేలపై టోల్ టాక్స్ చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్ వాడేవారికి కూడా బ్యాడ్ న్యూస్. ట్రాన్స్‌పోర్ట్ కేటగిరీ కింద నెలకు రూ. 40 వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే.. అదనంగా 1 శాతం ఛార్జీ మరియు జీఎస్టీ వర్తిస్తాయి.

5. ఇంటర్నేషనల్ ఆన్‌లైన్ షాపింగ్‌పై డబుల్ ఛార్జ్:

విదేశీ వెబ్‌సైట్లు లేదా అంతర్జాతీయ మర్చంట్స్ నుంచి ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు, బిల్లింగ్ డాలర్లలో కాకుండా నేరుగా భారతీయ రూపాయిల్లో (INR) జరిగితే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీ పడుతుంది. స్టాండర్డ్ కార్డ్‌లు, టైగర్ కార్డ్‌ల కోసం బ్యాంక్ ఈ DCC ఛార్జీని 1 శాతం నుండి ఏకంగా 2 శాతానికి (అదనంగా జీఎస్టీ) పెంచింది. దీనివల్ల గ్లోబల్ ఆన్‌లైన్ షాపింగ్ మునుపటి కంటే మరింత ఖరీదైనదిగా మారనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News