Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Gold Price Today: బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన ధరలు తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇవే!

MAHAA News 2 weeks ago

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగానే తీపి కబురు. గత కొంతకాలంగా పరుగులు పెట్టిన పసిడి ధరలు, ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, మారుతున్న ప్రపంచ పరిణామాల వల్ల పసిడి ధరల్లో వరుసగా క్షీణత కనిపిస్తోంది. వారం ప్రారంభంలోనే అంటే సోమవారం నాడు కూడా ధరలు తగ్గడంతో, కొనుగోలుదారులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రానున్న రోజుల్లో రేట్లు మరిన్ని తగ్గే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు:
మన హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,50,920 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.10 తగ్గింది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,340 వద్ద ట్రేడవుతోంది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇవే ధరలు అమలులో ఉన్నాయి. భారీగా కాకపోయినా, ధరలు పెరగకుండా నిలకడగా కిందకు వస్తుండటం సామాన్యులకు ఊరటనిస్తోంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో:
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,220గా ఉండగా, చెన్నైలో మాత్రం దీని ధర కొంచెం ఎక్కువగా రూ.1,52,720 వద్ద ఉంది. ఐటీ సిటీ బెంగళూరులో హైదరాబాద్ తరహాలోనే రూ.1,50,920 వద్ద ధరలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ దాదాపుగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. పసిడి బాటలోనే వెండి కూడా నడుస్తోంది.

వెండి ధరల పరిస్థితి:
బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కేజీ వెండి ధర రూ.2,69,900 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.100 మేర తగ్గింది. అటు ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,64,900గా నమోదైంది. వరుసగా ధరలు పడిపోతుండటంతో, శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనాలనుకునే వారు షోరూమ్‌ల వైపు అడుగులు వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News