Dailyhunt

Harish Rao: హరీశ్‌రావు అరెస్ట్.. తెలంగాణలో హై టెన్షన్!

MAHAA News 3 weeks ago

Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కీలక నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. పరిగి ప్రాంతంలోని ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు వల్ల నష్టపోతున్న రైతులను పరామర్శించేందుకు ఆయన అక్కడికి బయలుదేరారు.

అయితే, ఆయన పర్యటనకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. హరీశ్‌రావుతో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ నాయకులను కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని ఈ సందర్భంగా హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు హరీశ్‌రావును అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్టులతో ప్రజా గొంతుకను నొక్కలేరని వారు మండిపడ్డారు.

పరిగి ఇండస్ట్రియల్‌ పార్క్‌ బాధితులకు అండగా ఉంటామని, రైతుల భూములను లాక్కోవడాన్ని తాము అంగీకరించబోమని బీఆర్‌ఎస్‌ శ్రేణులు స్పష్టం చేశాయి. ఈ అరెస్టు విషయం తెలియగానే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసనలు చేపట్టారు. ప్రస్తుతం హరీశ్‌రావును పోలీసులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనతో పరిగి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News