Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Marella Surya Teja Wedding: ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను స్వయంగా ఆహ్వానించిన మారెళ్ల వంశీకృష్ణ దంపతులు!

MAHAA News 5 days ago

Marella Surya Teja Wedding: 'మహా న్యూస్' (Mahaa News) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) మారెళ్ల సూర్య తేజ, సాయి సుచిత్రల వివాహ వేడుకకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖుల ఆహ్వాన పర్వం జోరుగా సాగుతోంది.

సెప్టెంబర్ 5న ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరగనున్న ఈ వివాహానికి సంబంధించి మహా న్యూస్ సీఎంపీ (CMD) మారెళ్ల వంశీకృష్ణ, ఆయన సతీమణి పద్మావతి దంపతులు ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.

నిన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి శుభలేఖ అందజేయగా.. తాజాగా నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లను కలిసి వివాహ పత్రికను అందజేశారు.

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు ఆహ్వానం..

మారెళ్ల వంశీకృష్ణ దంపతులతో కలిసి వరుడు సూర్య తేజ, కలిసి సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. పెళ్లి పత్రికను స్వీకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కాబోయే నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపి, వివాహ జీవితం ఆనందంగా సాగాలని ఆశీర్వదించారు.

నిన్న మెగాస్టార్ చిరంజీవి నివాసంలో..

అంతకుముందు రోజు హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లిన మారెళ్ల వంశీకృష్ణ కుటుంబ సభ్యులు.. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ దంపతులకు పెళ్లి కార్డు అందజేసి వివాహానికి ఆహ్వానించారు. చిరంజీవి దంపతులు వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ఒంగోలులో వివాహం - హైదరాబాద్‌లో రిసెప్షన్..

సెప్టెంబర్ 5న ఒంగోలులో పెళ్లి:

ఒంగోలు నగరంలో ఘనంగా జరగనున్న ఈ పెళ్లి వేడుకకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్:

వివాహం ముగిసిన అనంతరం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మీడియా రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News