Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Mark Zuckerberg: మోడీకి క్షమాపణలు చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్

MAHAA News 1 week ago

Mark Zuckerberg: సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) ప్లాట్‌ఫామ్‌లలో చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తి చెందడంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ (CSAM), AI ఆధారిత డీప్‌ఫేక్‌లు (Deepfakes) ఇంకా కంటెంట్ ఫిల్టరింగ్‌లో జరిగిన తీవ్ర లోపాలపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కేంద్ర ప్రభుత్వానికి ఇంకా మోడీ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) అధికారులకు, మెటా గ్లోబల్ నాయకత్వానికి మధ్య రెండు రోజుల పాటు సాగిన సుదీర్ఘ ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది.

క్షమాపణలు కోరిన జుకర్‌బర్గ్ - తప్పులను అంగీకరించిన మెటా!

సమావేశంలో ప్లాట్‌ఫామ్ జవాబుదారీతనం, కంటెంట్ నియంత్రణ మరియు భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

  • తప్పుల అంగీకారం: తమ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ మోడరేషన్‌లో తీవ్ర లోపాలు దొర్లాయని, హానికరమైన కంటెంట్‌ను నిరోధించడంలో విఫలమయ్యామని మెటా ప్రతినిధులు అంగీకరించి విచారం వ్యక్తం చేశారు.

  • ఆల్గోరిథమ్ ప్రమోషన్: కొన్ని నిర్దిష్ట కేటగిరీల కంటెంట్‌ను బూస్ట్ చేయడం కోసం భారీగా నిధులు ఖర్చు చేశామని, ఆ నిర్ణయాలు సరైనవి కావని అంగీకరిస్తూ ఖేదం వ్యక్తం చేశారు.

“మీకు ‘సేఫ్ హార్బర్’ రక్షణ వర్తించదు!”: కేంద్రం కఠిన హెచ్చరిక

ఈ చర్చల సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు మెటా ప్రతినిధులకు అత్యంత స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.

ఐటీ చట్టం ప్రకారం సోషల్ మీడియా సంస్థలకు లభించే ‘ఇంటర్మీడియరీ’ (Intermediary – మధ్యవర్తి) హోదా, అలాగే ‘సేఫ్ హార్బర్’ (Safe Harbour – చట్టపరమైన మినహాయింపు) రక్షణ ఇకపై మెటాకు వర్తించదని కేంద్రం తెగేసి చెప్పింది.

“ఏ కంటెంట్ ఎవరికి చేరాలో, ఏ వీడియోలు ఎక్కువగా వైరల్ కావాలో మీ ఆల్గోరిథమ్‌లే స్వయంగా నిర్ణయిస్తున్నాయి. కంటెంట్‌ను మీరే ఎంచుకుని ప్రమోట్ చేస్తున్నప్పుడు మీరు కేవలం ఒక ‘మధ్యవర్తి’గా ఉండలేరు. కాబట్టి ఐటీ చట్టం సెక్షన్ 79 కింద లభించే చట్టపరమైన రక్షణ మీకు వర్తించదు.”

- కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపుపై కూడా సమావేశంలో చర్చలు జరుగుతాయని భావించినప్పటికీ, ప్రాథమికంగా CSAM, డీప్‌ఫేక్ కంటెంట్, వినియోగదారుల భద్రత మరియు చట్టపరమైన బాధ్యతలపైనే చర్చలు జరిగినట్లు సమాచారం. భారత డిజిటల్ స్పేస్‌లో వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగిస్తే ఎంతటి గ్లోబల్ టెక్ దిగ్గజమైనా సరే చట్టబద్ధమైన చర్యలు తప్పవని కేంద్రం ఈ భేటీ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News