Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Mirza Rahmath Baig: రాజీనామాకు నిరాకరణ?.. సీబీఐ విచారణ కోరిన బీజేపీ!

MAHAA News 1 week ago

AIMIM MLC: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వివాదాస్పద వీడియో వ్యవహారం హైదరాబాద్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ శాసనమండలి సభ్యుడు (MLC) మీర్జా రహమత్ బేగ్ (Mirza Rahmath Baig) ను ఎంఐఎం (AIMIM) పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తక్షణమే బహిష్కరిస్తూ అధిష్టానం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని శాసనమండలి చైర్మన్‌కు లేఖ సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

అయితే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు రహమత్ బేగ్ నిరాకరించినట్లు, ఆయన రాజీనామా పత్రం ఇంకా చైర్మన్ కార్యాలయానికి చేరలేదని తెలుస్తుంది.

వివాదం నేపథ్యం - వీడియో లీక్ కలకలం..

ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌కు సంబంధించిందని చెబుతున్న ఓ వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు ఓ మహిళ ఇంటికి మారువేషంలో వెళ్లిన దృశ్యాలంటూ కొన్ని వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

తనను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తూ మార్ఫింగ్/డీప్‌ఫేక్ వీడియోలను విడుదల చేస్తామని బెదిరిస్తున్నారంటూ రహమత్ బేగ్ అంతకుముందు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

అర్ధరాత్రి బహిష్కరణపై రాజాసింగ్ నిలదీత..

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపించారు..

  • సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రలో ఉన్న ఎమ్మెల్సీని హడావుడిగా ఎందుకు వెనక్కి పిలిపించారు?

  • అర్ధరాత్రి పూట ఆయన్ను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది? రాజీనామా ఎందుకు డిమాండ్ చేశారు?

  • వైరల్ వీడియో వెనుక ఉన్న వాస్తవాలు, ఆరోపణలను ప్రజల ముందు ఉంచాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

సీబీఐ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణకు బీజేపీ డిమాండ్..

తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, పార్టీ నేతలు స్పందిస్తూ.. కేవలం పార్టీ నుంచి బహిష్కరిస్తే న్యాయం జరిగినట్లు కాదని, మహిళలు, మైనర్లకు సంబంధించిన తీవ్ర ఆరోపణలు వచ్చినప్పుడు సమగ్రమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఈ కేసుపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ద్వారా నిష్పక్షపాత విచారణ జరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యం లేకుండా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని డిమాండ్ చేశారు.

డ్రైవర్‌గా ప్రస్థానం ప్రారంభించి ఎంఐఎం పార్టీలో కీలక నేతగా ఎదిగిన రహమత్ బేగ్.. 2023లో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News