Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

MYSAA: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మైసా' రిలీజ్ పోస్టర్.. నెవర్ బిఫోర్ అవతార్ లో రష్మిక

MAHAA News 4 days ago

MYSAA: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa) విడుదల తేదీ ఖరారైంది.

ఈ సినిమా కేవలం ఒక సాధారణ లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదని, రష్మిక మునుపెన్నడూ చూడని అత్యంత సాహసోపేతమైన యాక్షన్ అవతారంలో కనిపించనుందని మూవీ టీమ్ స్పష్టం చేసింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు. దసరా, డిసెంబర్ అలాగే సంక్రాంతి సీజన్లలో ఉండే భారీ పోటీని దృష్టిలో ఉంచుకుని, నవంబర్ నెలాఖరు రిలీజ్‌కు సరైన సమయంగా భావించి మేకర్స్ ఈ తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఒళ్లు గగుర్పొడిచేలా ఫెరోషియస్ పోస్టర్..రిలీజ్ డేట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రష్మిక అద్భుతమైన రౌద్ర రూపంలో కనిపించారు. సాంప్రదాయ గిరిజన వస్త్రధారణ, విరబోసిన జుట్టు, ముఖం నిండా దుమ్ము ఇంకా రక్తంతో.. చేతిలో భారీ బల్లెం పట్టుకుని తీవ్రమైన ఆవేశంతో నిలబడిన లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఆమె వెనుక రగులుతున్న అగ్నికీలలు, పొగ, నిప్పురవ్వలు వీటితో పాటు భారీ సంఖ్యలో ఆడవాళ్లు ఉండి అక్కడ ఉన్న అందరి చేతులలో పదునైన ఆయుధాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వీటితోపాటు రష్మిక చేతికి పోలీస్ సంకెళ్లు వేసి ఉండడం కూడా కనిపిస్తుంది. అంటే ఆమె జైలు నుండి తప్పించుకొని వచ్చిందా లేక ఆ ఫైట్‌లో ఆమెని జైలుకు తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారా అనేది సినిమాలోనే చూడాలి. ఈ జనాలందరూ ఎవరితో గొడవ పడుతున్నారు, దేనికోసం పడుతున్నారు అనేది కూడా టీజర్ లేదా ట్రైలర్‌లో తెలుస్తుంది.గోండు గిరిజన యువతిగా రష్మిక..ఈ సినిమాలో రష్మిక ‘గోండు’ తెగకు చెందిన గిరిజన యువతి పాత్రను పోషిస్తున్నారు. అటు భావోద్వేగాలను, ఇటు అత్యంత క్లిష్టమైన ఫిజికల్ స్టంట్లను సమపాళ్లలో ప్రదర్శించాల్సిన ఈ పాత్ర కోసం ఆమె తీవ్రమైన శారీరక కసరత్తులు చేశారు.షూటింగ్ ముగింపు దశకు..ఇటీవల ఓ సాంగ్ షూటింగ్ సమయంలో గాయపడిన రష్మిక ప్రస్తుతం కోలుకొని షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కేవలం 12 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తుండగా, ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ (Unformula Films) బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News