Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!

MAHAA News 6 days ago

RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అనగానే అందరికీ తాను చేసిన లవ్ స్టోరీస్ ఇంకా యాక్షన్ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. ఇప్పుడు తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి డైరెక్టర్‌గా మారి తనని తాను కొత్త అవతారంలో చూపించనున్నారు.

ఈ సినిమాలో వీర అనే పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. రెడ్ సినిమా లాంటి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ (Psychological Action Thriller) తో రానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతూ కన్నడ ఇండస్ట్రీ వరకు వెళ్లిపోయింది మూవీ టీమ్.

కన్నడతో పాటు ఇండియా మొత్తం కేజీఎఫ్ సినిమాతో పరిచయం అయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టికి స్టోరీ చెప్పగా.. ఆమె పాజిటివ్‌గా స్పందించినట్టు ఫిలిం నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో స్టోరీలో ఆమె క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌తో పాటు యాక్టింగ్‌కి స్కోప్ ఉండటంతో ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి రెమ్యూనరేషన్ ఇంకా డేట్స్ అడ్జస్ట్‌మెంట్‌ పైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీటిపైన ఓ క్లారిటీ వస్తే మూవీ టీమ్ అఫీషియల్ నోట్ రిలీజ్ చేస్తారు.

న్యూ చాప్టర్ మొదలు..

హీరో రామ్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాకి రామ్ రైటర్ ఇంకా డైరెక్టర్‌గా ఉండడం విశేషం. ఇది ఒక 'ఏ స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్' (A Story of a Lone Wolf) గురించి అని ట్యాగ్ చేశారు. సినిమా నుండి పోస్టర్స్ ఇంకా టీజర్ వస్తే గానీ ఈ సినిమా గురించి తెలియదు. ఈ సినిమాని కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News