Dailyhunt

Suicide: 5 ఏళ్ల ప్రేమ.. పెళ్లైన 50 రోజులోనే యువతీ మృతి

MAHAA News 1 week ago

Suicide: ఐదు సంవత్సరాల ప్రేమ, పెళ్లైన 50 రోజులు కూడా కాకముందే యువతిని బలితీసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.

ఈమెకు 2025లో ఫేస్‌బుక్ లో మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇతను హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కాలం గడిచే కొద్దీ వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న ఇద్దరూ తమ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి 2026 ఫిబ్రవరి 10న పట్నాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి తర్వాత ఇషిక తన కంపెనీ వారితో మాట్లాడి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ మియాపూర్‌ లో ఓ అపార్ట్‌మెంట్‌లో రెంట్‌కు ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పెళ్లైన కొన్ని రోజులు బాగానే ఉన్నారు, ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ పెళ్లైన 50 రోజుల తర్వాత భర్త నీరజ్ బన్సాల్‌ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి చూడగా, ఇషిక యాదవ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. అతను వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో హాస్పిటల్ వద్దకు చేరుకున్న వారు నీరజ్ బన్సాల్‌ పైనే అనుమానం ఉన్నట్లు తెలిపారు. పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం ఆమెను వేధించేవారని, దానితోనే ఇషిక యాదవ్ బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపణలు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News