Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Tamannaah: 'బాహుబలి' ఫ్లాప్ అయ్యేదే.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్!

MAHAA News 2 days ago

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటించి సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఈ మధ్య కాలంలో ఆమె టాలీవుడ్‌కు కాస్త దూరమై, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటోంది. కెరీర్‌లో మంచి పాత్రలు చేయాల్సిన తమన్నా.. ఈ మధ్య ఎక్కువగా కేవలం స్పెషల్ సాంగ్స్ కే పరిమితం కావడం ఆమె అభిమానులను కొంతవరకు బాధపెడుతోంది. ఇలాంటి సమయంలో తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లోనే అతిపెద్ద సినిమా అయిన 'బాహుబలి' గురించి ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బాహుబలి సినిమా కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా గొప్పగా అనిపిస్తుందని తమన్నా చెప్పింది. కానీ, ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ట్రేడ్ లెక్కలు వేరేలా ఉండేవని గుర్తుచేసింది. కేవలం ఒక ప్రాంతీయ భాషా సినిమా కోసం ఆ కాలంలోనే దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ పెట్టడం అనేది అసలు మామూలు విషయం కాదని ఆమె అంది. అప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం చూస్తే.. అంత పెద్ద మొత్తం ఖర్చు చేయడం అనేది సినిమా ఫ్లాప్ అవ్వడానికి, భారీ నష్టాలు రావడానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన నిర్ణయంలా అనిపించిందని తమన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది.

అయితే, దర్శకుడు రాజమౌళి గారు తన కథను, తన నమ్మకాన్ని పూర్తిగా నమ్మారని తమన్నా కొనియాడింది. ఎక్కడా వెనకడుగు వేయకుండా, రాజీ పడకుండా ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని చెప్పింది. ఆయన విజన్ వల్లే బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా అంతటి ఘనవిజయాన్ని సాధించిందని, లేదంటే ఆ రోజుల్లో చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవి అంటూ జక్కన్నపై తమన్నా ప్రశంసల వర్షం కురిపించింది. ప్రస్తుతం తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News