Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Toxic Collections: డిజాస్టర్ టాక్ వచ్చిన.. కలెక్షన్స్ లో దుమ్ములేపుతున్న 'టాక్సిక్'

MAHAA News 2 weeks ago

Toxic Collections: రాకింగ్ స్టార్ యశ్ వెండితెరపై అడుగుపెట్టి నాలుగేళ్లయినా ఆయన బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' (Toxic) మూవీ కి ఇండియా మొత్తం డిజాస్టర్ టాక్ వచ్చిన తెచ్చుకున్న ఓపెనింగ్స్ విషయంలో మాత్రం రికార్డులను తిరగరాసింది.

ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్ మై షో’లో తొలిరోజే ఏకంగా 9.05 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త సింగిల్ డే రికార్డు నమోదైంది.ఇది మొత్తం సినిమా రిలీజ్ కి ముందు బుకింగ్స్ వల్లే వచ్చినవి అన్నొచు ఎందుకంటే యష్ నుండి 4ఇయర్స్ తర్వాత ఒక్క సినిమా థియేటర్ రావడం అది కూడా కెజిఫ్-2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రావడంతో సినిమాపైన అంచనాలు ఆకాశాన్ని అంటుకున్నాయి.

తొలిరోజు ప్రపంచవ్యాప్త వసూళ్లు - నంబర్ల బ్రేకప్..

ట్రేడ్ వర్గాల (Sacnilk) లెక్కల ప్రకారం, భారతదేశ వ్యాప్తంగా 24,579 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రం సాధించిన లెక్కలు ఇలా ఉన్నాయి..

  • ఇండియా నెట్ కలెక్షన్స్: ₹101.10 కోట్లు

  • భారతదేశ గ్రాస్ వసూళ్లు: ₹120.75 కోట్లు

  • ఓవర్సీస్ గ్రాస్: ₹20.00 కోట్లు

  • మొత్తం ప్రపంచవ్యాప్త గ్రాస్ (WW Gross):₹140.75 కోట్లు

భాషల వారీగా తొలిరోజు ఇండియా నెట్ (Net) వసూళ్లు..

ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని భాషల్లోనూ ఈ చిత్రం భారీగా వసూలు చేసింది:

భాషతొలిరోజు నెట్ వసూళ్లు
హిందీ₹55.00 కోట్లు
కన్నడ₹23.30 కోట్లు
తెలుగు₹16.00 కోట్లు
తమిళం₹5.50 కోట్లు
మలయాళం₹1.30 కోట్లు
మొత్తం ఇండియా నెట్₹101.10 కోట్లు

‘కేజీఎఫ్-2’తో పోలిస్తే ఎలా ఉంది?..

యశ్ నటించిన అంతకుముందు సినిమా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తొలిరోజే భారత్‌లో ₹116 కోట్ల నెట్ వసూలు చేసి అసాధారణ మైలురాయిని నెలకొల్పింది. 'టాక్సిక్' కథనంపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, మొదటి రోజే ₹100 కోట్ల నెట్ క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో నయనతార, కియారా అడ్వాణీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషి వంటి భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా.. రాబోయే వీకెండ్‌లో సాధారణ ప్రేక్షకుల ఆదరణపై ఆధారపడి ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News