Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Viral News: చివరికి స్పూన్ కూడా వదలలేదు కదా.. బాలిలో ఇండియన్స్ దొంగతనం..!

MAHAA News 1 week ago

Viral News: విదేశాల్లో కొంతమంది భారతీయులు చేస్తున్న పనులు చూస్తుంటే మన దేశం పైన ఉన్న గౌరవం పోతుంది. టూరిస్ట్‌లుగా వెళ్లి దొంగలుగా మారి వస్తున్న జనాలు..

ఇలాంటి ఒక ఘటనే ఇండోనేషియాలో జరిగింది.

ఇండోనేషియాలోని బాలి చూడడానికి వెళ్లింది ఓ ఇండియన్ ఫ్యామిలీ. వెళ్లినప్పుడు బాగానే ఉంది అక్కడ ఉన్న ప్లేసులు అన్ని చూశారు, ప్రకృతి అందాలని కూడా ఆస్వాదించారు. ఎప్పుడైతే హోటల్ నుండి వెళ్లిపోవడానికి సమయం రావడంతో మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్లిపోయారు. కానీ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్లిన క్లీనర్‌కి షాక్ తగిలింది. వెంటనే వచ్చి రూమ్ లో ఉన్న వారిని ఆపగా వారికి ఏమీ అర్థం కాలేదు.. ఎప్పుడైతే బ్యాగ్‌లు చెక్ చేయాలన్నారో అప్పుడే మొత్తం అర్థం అయింది. చేసేది ఏమీ లేక ఇండియన్స్ బ్యాగ్‌లు తెరిచి చూపించగా.. అందులో ఉన్న ఐటమ్స్ చూసి హోటల్ సిబ్బంది షాక్ తిన్నారు.

ఒక్కటి కాదు రెండు కాదు బాత్రూం వస్తువుల నుండి చివరికి స్పూన్ వరకు అక్కడ ఉన్న వస్తువులు తమతో తీసుకొని వెళ్లిపోదాం అనుకున్నారు కానీ దొరికిపోవడంతో వీళ్ల ఆటలు సాగలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారతీయులు తమ చేతి వాటం చూపించారు అని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తుంటే, ఇంకొంతమంది మాత్రం ‘జయం మనదేరా’ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్‌ని నిజజీవితంలో చూసినట్టు ఉంది అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News