Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

VST Steel Bridge: అప్పులు కారణం కాదు.. ఆమె వల్లే చనిపోతున్నా..

MAHAA News 2 days ago

VST Steel Bridge: హైదరాబాద్ నగరంలో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. నగరంలోని ప్రముఖ వీఎస్టీ (VST) స్టీల్ బ్రిడ్జి పైనుంచి కిందికి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రేమించిన యువతి మోసం చేసిందన్న తీవ్ర మనోవేదనతోనే అతను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడైంది.

బైక్‌పై మొబైల్ వదిలేసి కిందకు దూకి..

అశోక్‌నగర్ పరిధిలోని పార్సిగుట్ట ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ అనే యువకుడు తన బైక్‌పై వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి పైకి చేరుకున్నాడు. బ్రిడ్జిపై బైక్‌ను పక్కగా ఆపి, తన మొబైల్ ఫోన్‌ను దానిపైనే వదిలేసి ఒక్కసారిగా కిందకు దూకాడు.

భారీ ఎత్తు పైనుంచి రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలపాలైన మనోజ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో చిక్కడపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మొబైల్‌లో సూసైడ్ నోట్ - పోలీసుల దర్యాప్తు..

బైక్‌పై ఉన్న మనోజ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో సూసైడ్ నోట్ లభ్యమైంది. తన మరణానికి ఎలాంటి ఆర్థిక కారణాలు లేదా అప్పులు కారణం కాదని, తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే తన చావుకు కారణమంటూ అతను అందులో స్పష్టంగా రాసినట్లు పోలీసులు గుర్తించారు.

మొబైల్‌లోని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. చేతికందివచ్చిన కొడుకు ప్రేమ వ్యవహారంలో బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

(గమనిక: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి, నిరాశ ఎదురైతే నిపుణుల సలహాలు పొందండి. తెలంగాణ స్నేహ హెల్ప్‌లైన్: 040-68205345).

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: MAHAA News