Coimbatore
Coimbatoreచెన్నై: పదేళ్ల బాలిక మృతదేహం చెరువులో కనిపించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సూలూరు ప్రాంతంలో జరిగింది. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... భారతీపురం గ్రామంలో పదేళ్ల బాలిక తన తల్లిదండ్రులకు కలిసి ఉంటుంది. గురువారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు స్థానికులతో కలిసి వెతికారు. ఎక్కడా బాలిక ఆచూకీ లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక నివాసం స్థలం నుంచి రెండు కిలో మీటర్ల దూరంలో గల కన్నంపాలయం చెరువులో బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఇఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. కార్తీక్ అనే యువకుడు చాక్లెట్లు కొనిస్తానని బాలికను బైక్ పై తీసుకెళ్లాడు.
బాలికపై అత్యాచారం చేసి అనంతరం బాలికను చంపేసి మృతదేహాన్ని చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పక్కనే ఉండే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిందితులను పట్టుకొని వెంటనే శిక్షించాలని బంధువులు, కుటుంబ సభ్యులు సూలూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు.

