బురుయ్పుర్: పశ్చిమ బెంగాల్లోని బురుయ్పుర్లో 11 ఏళ్ల బాలికను హత్యాచారం చేసిన నిందితుల్లో ఒకరు బుధవారం పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతడిని తీసుకెళ్లగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడని అధికారులు తెలిపారు.
ఓ పోలీసు సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించడమే కాకుండా.. ఒక రౌండ్ కాల్పులు కూడా జరిపాడని పేర్కొన్నారు. దీంతో ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. అతడికి బుల్లెట్ గాయాలయ్యాయని వెల్లడించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ కేసులో అతడు ప్రధాన నిందితుల్లో ఒకడని, బాలిక అదృశ్యమయ్యే ముందు ఆమెతో కలిసి ఉన్నట్లు సిసిటివి దృశ్యాల్లో గుర్తించినట్లు తెలిపారు.

