Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
30వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కి గుండెపోటు..

30వేల అడుగుల ఎత్తులో విమానం.. పైలట్‌కి గుండెపోటు..

Flight

స్పెయిన్‌లో ఓ విమానం ఘోర ప్రమాదం నుంచి తప్పంచుకుంది. 30వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తుండగా.. ఒక్కసారిగా పైలట్‌కు గుండొపోటు వచ్చింది. ఇది గమనించిన కో-పైలట్ వెంటనే ఫ్రాన్సిస్కో ర సా కార్నీరో ఎయిపోర్టుకు అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

వెంటనే పైలట్‌కు తగిన వైద్య సాయం అందించారు.

అసలేం జరిగిందటే.. శుక్రవారం తెల్లవారుజామున జెట్2 విమానం స్పెయిన్‌లోని టెనెరెట్ నుంచి బర్మింగ్‌హామ్‌కు బయలుదేరింది. 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా పైలట్‌కు గుండెపోటు వచ్చినట్లు కో పైలల్ గుర్తించాడు. వెంటనే దగ్గర్లోని ఫ్రాన్సిస్కో సా కార్నీరో ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశాడు. విమానం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే సమయానికి అధికారులు అత్యవసర వైద్య ఏర్పాట్లు చేశారు. వెంటనే పైలట్‌కు వైద్యసాయం అందించారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం 220 మంది ప్రయాణికులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu