మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా బ్లాక్‌బస్టర్ 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో భారీ మైలురాయిని అందుకుంది. 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్ యాక్షన్ డ్రామా వీకెండ్ మాత్రమే కాకుండా, వర్కింగ్ డేస్‌లో సైతం బలమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. రామ్ చరణ్ కెరీర్‌లో సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రం 'పెద్ది' కావడం విశేషం. రెండో వారంలోనూ సినిమా అద్భుతమైన రన్ తో రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినా ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించింది. అలాగే ప్రేక్షకులు 'పెద్ది' పాత్రతో ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారో ఈ విజయం రుజువు చేసింది. వెంకట సతీష్ కిలారు భారీ నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణ భారత చిత్రంగా నిలిచింది.

