Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
5200mAh బ్యాటరీ, 108MP కెమెరాతో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌!

5200mAh బ్యాటరీ, 108MP కెమెరాతో మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌!

మోటరోలా మిడ్-రేంజ్ విభాగంలో ప్రపంచ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీ దీనిని మోటో G47 పేరిట తీసుకొచ్చింది. ఇందులో 6.67-అంగుళాల HD+ డిస్ప్లే, 6nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, 108-మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5,200mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మోటో G47 ధర

కంపెనీ ఈ మోటో G47 స్మార్ట్‌ఫోన్ జర్మనీలో బేస్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 319 యూరోల (సుమారుగా రూ. 35,000) వద్ద ఉంచింది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్ ఫ్యూషియా రెడ్, పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ నాటికల్ బ్లూ రంగులలో అందుబాటులో ఉంది.

మోటో G47 ఫీచర్లు

ఇందులో 6.67-అంగుళాల HD+ (720 x 1,604 పిక్సెల్స్) 8-బిట్ LCD డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz వరకు, గరిష్ట ప్రకాశం 1,050 నిట్స్. ఫోన్ ముందు భాగానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉంది. మోటరోలా మోటో G47 స్మార్ట్‌ఫోన్ 6nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ సపోర్ట్ కోసం ARM మాలి-G57 MC2 GPU అందించారు.ఈ ఫోన్‌లో 8GB LPDDR4x RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. మోటో G47 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో UI తో వస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం, మోటో G47లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్స్ కాగా, దానితో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-ఇన్-1 లైట్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ పరికరం 5,200mAh బ్యాటరీతో 20W టర్బోపవర్ ఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C పోర్ట్, GPS, GLONASS, Galileo, BeiDou, QZSS కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu