Dailyhunt
6 గ్యారంటీల తరహాలోనే 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తాం: యుడిఎఫ్

6 గ్యారంటీల తరహాలోనే 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తాం: యుడిఎఫ్

తిరువనంతపురం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసిందని.. అదే తరహాలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలోకి వచ్చిన వెంటనే తమ హామీలను అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడు వి.డి.

సతీశన్ చెప్పారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సతీశన్ శుక్రవారం కొచ్చిలో UDF ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమ పథకాలు, యువతకు అండగా నిలిచేందుకు "5+1 హామీ"ని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీశన్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్ర రవాణా బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తిరువనంతపురంలో జరిగిన UDF 'పుతు యుగ యాత్ర' ముగింపు దశలో రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు కీలక హామీల ఆధారంగానే ఈ మేనిఫెస్టో రూపొందించామని సతీశన్ తెలిపారు. UDF అధికారంలోకి వస్తే, ప్రస్తుతం రూ. 2,000 ఉన్న సంక్షేమ పింఛన్లను రూ. 3,000కు పెంచుతామని ఆయన చెప్పారు. అలాగే, వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేస్తామని కూడా సతీశన్ హామీ ఇచ్చారు. కేరళలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా పథకాన్ని తీసుకొస్తామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu