టీం ఇండియా ఆడిన గత మూడు టి-20లలో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ గురించి అంతా ఎదురు చూశారు. కానీ, ఈ బుడ్డోడికి జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం రాలేదు. అయితే ఇవాళ రాత్రి జరగబోయే భారత్, ఇంగ్లండ్ 2వ టి-20లో వైభవ్ జట్టులోకి వస్తాడా అంటే అవుననే సమాధానం వస్తుంది.
అందుకు అతడి సోషల్మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తే అర్థవమవుతుంది. ఇంతకీ అతడు ఏం పోస్ట్ు పెట్టాడంటే..
ఇంగ్లండ్తో రెండో టి-20కి భారత్ సిద్ధమవుతోంది. మాంచెస్టర్ వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంద. ఇందులో ఎవరు గెలుస్తారు? ఎవరు బాగా ఆడుతారు? అనే విషయం పై కాకుండా వైభవ్ ఈ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే విషయం గురించే అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఇవాళ్టి మ్యాచ్లో ఎంట్రీ ఇస్తున్నట్లు వైభవ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడని కొందరు అభిమానులు అంటున్నారు. అదేంటే.. అతడు తన ఇన్స్టా స్టోరీ చేశాడు. అందులో తన ఫొటోపై 'కొత్త ఛాప్టర్' అని క్యాప్షన్ ఇచ్చిన వైభవ్.. దానికి టోర్నడో ఎమోజీని జత చేశాడు. విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నానని దాని అర్థం. మరి అది భారత్ జట్టులో ఎంట్రీ కోసమా? లేదా మరేదైనా యాడ్లో నటిస్తున్నాడా? అనే దానిపై క్లారిటీ లేదు. మొత్తానికి వైభవ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

