హైదరాబాద్: బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ ప్రేమలో పడింది. ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాల బైరవను పెళ్లి చేసుకుంటానని వెల్లడించింది. తన సోషల్ మీడియా ఖాతాలో కావ్య పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
కాల బైరవతో ప్రేమాయణం నడిపిస్తున్నానని చెప్పుకొచ్చింది. బలగం సినిమాలో కావ్య నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది. ఉస్తాద్ సినిమాలో కాల బైరవ తమ్ముడు సింహాతో జోడిగా నటించింది. సినిమా షూటింగ్‌లో కాల బైరవతో కావ్య ప్రేమలో పడింది. రీల్ లైఫ్‌లో తమ్ముడితో రియల్ లైఫ్‌లో అన్నకు భార్యగా రావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. గతంలో కొందరు హీరోయిన్లు కూడా ఇలానే పెళ్లిలు చేసుకున్నారు. శ్రీదేవీ-బోనీకపూర్, శ్రీయా రెడ్డి-విక్రమ్ రెడ్డి, సోనియా అగర్వాల్-సెల్వరాఘవన్ జంటలు కూడా పెళ్లి చేసుకున్నాయి.

