అమరావతి: ఫోన్‌లోని వీడియోలు ఓ యువకుడి ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... గిరిదర్ అనే యువకుడి వద్ద కొందరు యువతులతో గడిపిన ఏకాంతపు వీడియోలు ఉన్నాయి. పాలేపు వివేక్, ఏలూరి రామకృష్ణతో మద్యం సేవిస్తుండగా ఆ వీడియోలను గిరిధర్ చూపించాడు. ఆ వీడియోలతో యువతుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి బ్లాక్ చేయాలని వివేక్, రామకృష్ణ ప్లాన్ వేశారు. ప్లాన్‌లో భాగంగా ఆ వీడియోలను గిరిధర్‌ను అడిగారు. అతడు ఇవ్వనని చెప్పడంతో వారు గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో వివేక్, రామకృష్ణలు గిరిధర్‌ను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి ఫోన్ కాల్స్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

