Dailyhunt
ఆదుకున్న క్లాసెన్, నితీశ్.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

ఆదుకున్న క్లాసెన్, నితీశ్.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

SRH vs LSG

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లోక్న సూపర్ జెయింట్స్ బౌలర్లు చెలరేగిపోయారు.

లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టుకు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టును షమీ కుదిపేశాడు. తొలి ఓవర్‌లో అభిషేక్‌ని, మూడో ఓవర్‌లో హెడ్‌ను ఔట్ చేశాడు. ఒక దశలో 26 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది.

ఈ దశలో జట్టును క్లాసెన్, నితీశ్ రెడ్డిలు ఆదుకున్నారు. వికెట్‌ని కాపాడుకుంటూనే.. పరుగులు రాబట్టారు. ఐదో వికెట్‌కి వీరిద్దరు కలిసి 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ భాగస్వామ్యానికి సిద్ధార్త్ బ్రేక్ వేశాడు. సిద్ధార్త్ బౌలింగ్‌లో నితీశ్ (56) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే క్లాసెన్(62) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్‌లో షమీ, అవేశ్, ప్రిన్స్ చెరి రెండు, దిగ్వేశ్, సిద్ధార్త్ తలో వికెట్ తీశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu