Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆందోళన విరమణ

ఆందోళన విరమణ

న్యూఢిల్లీ: నీట్ లీకేజీ వ్యవహారంపై 37 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలకు ఎట్టకేలకు శనివారంనాడు తెరపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ప్రధాన డిమాండ్ నె రవేరింది.

తక్కిన రెండు డిమాండ్లు కూడా నెరవేర్చేందుకు కేంద్రం అం గీకరించడంతో తమ నిరసనలను విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రలు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌తో సీజేపీ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. అనంతరం చర్చలు ఫలప్రదమైనట్టు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. విద్యార్థుల అన్ని డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అం గీకరించినందున ఆందోళన విరమిస్తున్నట్టు తెలిపారు.

నిరసనకారు లు జంతర్ మంతర్‌ను వీడి సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో కలిసి సీజేపీ ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యా వ్యవస్థ, పరీక్షల్లో సమూల మార్పులు చేస్తామని ఇప్పటికే చెప్పామని, నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. భవిష్యత్తులో ఎవరినీ కేసులతో వేధించమని, ఎఫ్‌ఐఆర్ కాపీలు అందజేస్తామని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని, పరిహారం విషయంలో సానుభూతితో వ్యవహరిస్తామని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.

పరిహారం ఎంత గరిష్టంగా ఇచ్చే అవకాశం ఉందో అంతవరకూ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించిందని, పేపరు లీకేజీలతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు సంబంధించి బాధిత కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఐదు పాయింట్ల డిమాండ్ చార్టర్‌ను ప్రభుత్వం ముందుంచామని తెలిపారు. మరో నాలుగు వారాల తర్వాత తదుపరి రౌండ్ చర్యలు జరుపుతామన్నారు. తాము ఆశించిన చర్చలను కేంద్రం త్వరిగతగతిన తీసుకుంటుందనే విశ్వాసంతో ఆందోళనను విరమిస్తున్నామని ప్రకటించారు. నిరసనకారులు జంతర్‌మంతర్ విడిచిపెట్టి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu