ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త ఫీచర్ ఎట్టకేలకు గూగుల్ తీసుకొసతోంది. బీటా అప్‌డేట్ ద్వారా గూగుల్ మ్యాప్స్‌లో లైవ్ స్పీడ్ లిమిట్ మీటర్‌ను రోల్ అవుట్ చేసత్ోంది.
దీంతో, ఇక నుంచి వాహన స్పీడ్ లిమిట్ సలువుగా తెలుసుకోవచ్చు. చాలా కాలం నంచి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనర్ యూజర్లకు దర్శనమిస్తోంది. 2024లో యాపిల్ కార్‌ప్లేకు తీసుకురాగా, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో యూజర్లకూ అందుబాటులోకి రానుంది.
ఇకపై ఆండ్రాయిడ్ ఆటోపై గూగుల్ మ్యాప్స్ ఇంటర్‌ఫేస్‌లో నేరుగా వాహన స్పీడ్ దర్శనమిస్తుంది. లైవ్ స్పీడో మీటర్ ద్వారా వాహన ప్రస్తుత వేగాన్ని తెలుసుకోవచ్చు. కారు ఇన్‌స్ట్రుమెంట క్లస్టర్ను స్విచ్ చేయకుండానే వాహన వేగాన్ని పర్యవేక్షించుకోవచ్చు. మలుపుల వద్ద దిశానిర్దేశాలను గమనించొచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్ ఆటో లేటెస్టు బీటా వర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ఫీచర్ ఇప్పటికే పరిమిత యూజర్లకు అందుబాటులోకి రాగా, దశలవారీగా త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

