అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం షికారుగంటి వద్ద ఆటోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గజరాయుని గ్రామానికి చెందిన గుణుపూరు తిరుపతి అనే వ్యక్తి తన ఆటోలో రైతు తెర్తి ఆదినారాయణ వస్తున్నాడు. పెద్దమానపురం వద్ద ఆటోలో గుడ్ల రాము కూడా ఎక్కాడు. షికారుగంటి చౌరస్తాకు రాగానే లారీ అతి వేగంతో ఆటోను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతుడు తిరుపతికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదినారాయణ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక్క రోడ్డు ప్రమాదంతో మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

