PV Sindhu
భారత స్టార్ షట్లర పివి సింధు మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గంటకుపైగా ఉత్కంఠభరితంగా సాగిన సెమీప్లో హినా అకేచి (జపాన్)పై 21-10, 20-22, 21-16 తేడాతో విజయం సాధించింది.
ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నం.1 ఆన్ సే యంగ్‌తో తలపడనుంది. పివి సింధు ఈ ఏడాది సూపర్ 750 ఫైనల్‌కు దూసుకెళ్లడం ఇది రెండోసారి. జులైలో జపాన్ ఓపెన్ సూపర్ 70 టైటిల్ విజేతగా నిలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా ఆమె రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

