Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అదిరిపోయే రొమాంటిక్ 'కొంచెం కొంచెం..'

అదిరిపోయే రొమాంటిక్ 'కొంచెం కొంచెం..'

యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా, కమర్షియల్ హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్‌టైనర్ 'నేను రెడీ'.

హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట 'కొంచెం కొంచెం'ను లాంచ్ చేశారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ స్వరపరిచిన 'కొంచెం కొంచెం' రొమాంటిక్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ మాట్లాడుతూ "త్రినాథరావు 'నేను లోకల్', 'ధమాకా'లాంటి మాస్ ఎంటర్‌టైనర్స్ అందించారు. ఈ సినిమా కూడా అలాంటి మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం ఆకట్టుకున్నాయి"అని తెలియజేశారు.

కేఎల్ నారాయణ మాట్లాడుతూ హవీష్‌కు ఈ సినిమాతో పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. హీరో హవీష్ మాట్లాడుతూ "త్రినాథరావు నాతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయించారు. నా వరకు యాక్టింగ్‌లో అన్నింటికంటే కష్టమైనది రొమాన్స్ చేయడమే. త్రినాథరావు ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది"అని అన్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ "ఇందులో సాంగ్ కోసం నర్గిస్ ఫక్రీ పేరు చెప్పగానే మా నిర్మాతలు వెంటనే అంగీకరించారు. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌"అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావ్యా థాపర్, కోనేరు సత్యనారాయణ, శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu