ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఘనంగా ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి.. రెండోసారి ఆర్‌సిబి ఛాంపియన్‌గా నిలిచింది. ఐపిఎల్ ముగియడంతో అందరి దృష్టి ఇక భారత ఆడే మ్యాచ్‌లపై పడింది.
తొలుత భారత్ స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఆడనుంది. అయితే ఈ వన్డే సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ తగిలే అవకాశం ఉంది. ఈ సిరీస్‌కి విరాట్ కోహ్లీ దూరం అవుతాడనే టాక్ వినిపిస్తోంది. తొడ కండరాల గాయంతో విరాట్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
జూన్ 13 నుంచి జూన్ 20 వరకు మూడు ఇరు జట్లు మూడు వన్డేల్లో తలపడతాయి. భారత్ తరఫున కేవలం వన్డేల్లోనే కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ అద్భుత ప్రదర్శన చేశాడు. 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఆర్సిబి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ క్రమంలోనే విరాట్ గాయంతో బాధపడుతుండటం మనం గమనించాం. ఫిజియోతో సపర్యలు చేయించుకొని మరి చివరి వరకూ క్రీజ్‌లో నిలబడ్డాడు. కానీ, ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అఫ్గాన్ సిరీస్ నుంచి వైదొలగుతాడని బిసిసిఐ వర్గాలు పేర్కొన్నాయి.

