Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అగ్నిప్రమాదం.. కమిషనర్ చాంబర్ లో ఫర్నిచర్ దగ్ధం

అగ్నిప్రమాదం.. కమిషనర్ చాంబర్ లో ఫర్నిచర్ దగ్ధం

హైదరాబాద్: శేరిలింగంపల్లి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అగ్నిప్రమాదం జరిగింది. జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కమిషనర్ చాంబర్ లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యింది.

కార్యాలయం వెనకాల ఉన్న సబ్ స్టేషన్ లో ఏర్పడిన స్పార్క్ వల్ల వెనకాల ఉన్న చెట్లకు అగ్గి రాజుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలగుండా జోనల్ కార్యాలయంలోకి మంటలు వ్యాపించాయని సిఎంసి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఆస్తి నష్టం ఎంత జరిగిందోనని అంచనా వేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu