Dailyhunt
ఐపిఎల్ 2026.. ప్లేఆఫ్‌కి మూడు వేదికలు.. ఫైనల్ ఎక్కడంటే..?

ఐపిఎల్ 2026.. ప్లేఆఫ్‌కి మూడు వేదికలు.. ఫైనల్ ఎక్కడంటే..?

పిఎల్ 19వ తుది దశకు చేరుకుంది. త్వరలోనే లీగ్ దశ మ్యాచులు ముగించుకొని ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడుతోంది. లీగ్ దశలో టాప్‌లో ఉన్న నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తాయి.

ఇందులో క్వాలిఫయర్-1లో టాప్‌లో ఉన్న రెండు జట్లు తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. 3, 4 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఇందులో ఓడిన జట్టు ఇంటికి గెలిచిన జట్టు క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుతో తలపడతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది

ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ వేదికలను బిసిసిఐ ఖరారు చేసింది. అలాగే ఫైనల్‌కు బెంగళూరు కాకుండా.. అహ్మదాబాద్‌ను వేదికగా చేస్తూ ప్రకటన విడుదల చేసింది. మే 24తో లీగ్ స్టేజ్‌ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఆ తర్వాత రెండు రోజుల అనంతరం నాకౌట్ మ్యాచులు మొదలవుతాయి. ఇందులో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ధర్మశాలలో మే 26న జరుగుతుంది. ఆ తర్వాత మే 27న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇక మే 29న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే 31న ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu