Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్టోబర్ 6న  5 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు

అక్టోబర్ 6న 5 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు

ECI Releases Schedule for Munugode Bypolls

మిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అసోంలోని ఒక లోక్‌సభ నియోజకవర్గానికి అక్టోబర్ 6న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారంనాడు ప్రకటించింది.

అక్టోబర్ 9న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. పశ్చిమబెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీనగర్, తమిళనాడులోని మదురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టాంచావడికి ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అసోంలోని నాగావ్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా అక్టోబర్ 6న పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 9న గెటిట్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు సెప్టెంబర్ 16 చివరి తేదీ. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన, 19న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడవు అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఈ ఉప ఎన్నికల్లో వినియోగించేందుకు కమిషన్ నిర్ణయించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Mana Telangana Telugu