'గంగోత్రి' సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత స్టైలిష్ స్టార్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్.
'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారి.. పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నారు బన్నీ. ఈ రోజు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ''#AA22xA6'' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది.
అయితే బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్. ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించింది. ఈ సినిమాకి 'రాకా' అని నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ గుండుతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే ఈ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క పోస్టర్‌తోనే సినిమాపై హైప్‌ని పెంచేశారు. పోస్టరే ఇలా ఉందంటే.. సినిమా ఇంక ఏ రేంజ్‌లో ఉంటుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు.. మొత్తం 7 భాషల్లో విడుదల కానుంది. ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నారు.

